చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

  • వాదనలకు సమయం కావాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాదులు
  • ఈ నెల 23కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
  • కేసులో నిందితులుగా ఉన్న లోకేశ్, మాజీ మంత్రి నారాయణ తదితరులు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది.

Chandrababu
Telugudesam
Inner Ring Road Case
AP High Court
Bail

More Telugu News